ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు అరవింద్ పై త్రివిక్రమ్ అసహనం ఎందుకంటే ?

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 14, 2020, 12:46 PM

ఈ మధ్యన 'అల వైకుంఠపురములో' సినిమా హిందీ రీమేక్ రైట్స్ ని సల్మాన్ కోసం బాలీవుడ్ నిర్మాత ఒకరు 8 కోట్లకి కొన్నారని టాక్ నడవడమే కాదు.. సల్మాన్ ఖాన్ 'అల వైకుంఠపురములో' రీమేక్ పై ఆసక్తి చూపుతున్నాడనే అన్నారు. అయితే హిందీ లో అల డీల్ నిజమే కానీ... మధ్యలో అరవింద్ వేసిన అడ్డు పుల్లతో ఆ డీల్ ఆగింది. త్రివిక్రమ్ - చినబాబు కలిసి హిందీ రీమేక్ రైట్స్ ని రికార్డు ధరకి అమ్మడానికి బాలీవుడ్ నిర్మాత ఒకరితో బేరం కుదుర్చుకున్నాక... అబ్బే 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్ రైట్స్ అమ్మొద్దు నేనే హిందీలో రీమేక్ చేసి సినిమా తీస్తా అని అల్లు అరవింద్ త్రివిక్రమ్ కి అడ్డు చెప్పడంతో.. త్రివిక్రమ్ చేసేదేం లేక ఆ హిందీ డీల్ క్యాన్సిల్ చేసాడట. కానీ త్రివిక్రమ్ మాత్రం అరవింద్ చేసిన పనికి అసహనంగా ఉన్నాడని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa