పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం 'అజ్ఞాతవాసి'కి సంబంధించిన మరికొన్ని స్టిల్స్‌ను ఈ సినిమా బృందం ఈ రోజు విడుదల చేసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత రాధాకృష్ణ నిర్మించిన 'అజ్ఞాతవాసి' సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఇందులో ఖుష్బూ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు.
ఇక ఈ కొత్త ఫొటోలలో ఓ దాంట్లో ఖుష్బూ.. పవన్ కల్యాణ్‌కి టిఫిన్ అందిస్తున్నట్లు ఉంది. మరో స్టిల్‌లో పవన్ గడ్డిమోపు ఎత్తుకొస్తూ చేతిలో కొడవలితో రైతులా కనపడుతున్నారు. మరికొన్ని స్టిల్స్‌లో హీరోయన్‌లతో రొమాన్స్ చేస్తున్నారు. మీరూ చూడండి...
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa