ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'2 స్టేట్స్' రీమేక్ లో రాజశేఖర్ కూతురు శివాని?

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 08, 2018, 04:59 PM

జీవితా రాజశేఖర్ కూతురు శివాని .. హీరోయిన్ గా వెండితెరకి పరిచయం కానుందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే ముందుగా ఆమె ఓ తమిళ సినిమా చేయనుందనీ .. ఆ తరువాత తెలుగు సినిమా చేయనుందనే టాక్ వచ్చింది. అయితే ఆమె ముందుగా ఓ తెలుగు సినిమానే చేయనుందనేది తాజా సమాచారం.


ఇది ఓ బాలీవుడ్ హిట్ మూవీకి రీమేక్. బాలీవుడ్లో 2014లో '2 స్టేట్స్' అనే సినిమా వచ్చింది.  అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో అర్జున్ కపూర్ .. అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అలాంటి ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఉత్తరాది భామగా శివాని కనిపించనుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.   






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa