ప్రస్తుతం తమిళ హీరో ధనుష్ తన 40వ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. వై నాట్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ఈనెల 19న విడుదల కానుంది. కాగా ఈ చిత్ర తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా తెలుగు వర్షన్ డిస్ట్రిబ్యూటింగ్ రైట్స్ గీతా ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని వై నాట్ స్టూడియోస్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా తెలియజేశారు. ధనుష్ గత చిత్రాలు మంచి విజయం సాధించిన నేపథ్యంలో మంచి ధర చెల్లించి ధనుష్ మూవీ తెలుగు విడుదల హక్కులు దక్కించుకున్నారట. ఇక గీతా ఆర్ట్స్ 2 మరియు యూవీ క్రియేషన్స్ కలిసి సాయి ధరమ్ హీరోగా ప్రతిరోజు పండగే చిత్రాన్ని నిర్మించగా సూపర్ హిట్ గా నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa