కియారా అద్వానీ `భరత్ అనే నేను` మహేష్ బాబు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా సూపర్‌హిట్ కావడంతో వెంటనే తెలుగులో మరో ఆవకాశం ఆమెని వరించింది. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన చిత్రం `వినయ విధేయ రామ`. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కు జోడీగా నటించింది. సినిమా డిజాస్టర్ కావడంతో కియారా తెలుగు మార్కెట్ పడిపోయినట్టేనని అంతా భావించారు కానీ ఆమెపై `వినయ విధేయ రామ` ఫ్లాప్ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది. తాజాగా కియారాకు తెలుగులో మరో భారీ ఆఫర్ లభించినట్టు తెలిసింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరపైకి రాబోతోంది. ఈ చిత్రం కోసం కియారాని చిత్ర బృందం సంప్రదించారట. రెండు కోట్లు పారితోషికం అయితేనే చేస్తానని కియారా కరాఖండీగా చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. `అర్జున్‌రెడ్డి` బాలీవుడ్ రీమేక్ `కబీర్‌సింగ్` బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కియారా క్రేజ్ పెరిగిపోయింది. దాంతో తన క్రేజ్‌కి తగ్గట్టే రెమ్యునరేషన్‌ని కియారా డిమాండ్ చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa