కొన్ని సినిమాలు హీరో స్టార్ డంను పెంచితే.. మరికొన్ని సినిమాలు ఆ హీరోను తమ కుటుంబంలో ఒకడిలా చేసుకునేంత మనసుకు దగ్గర చేస్తాయి. అలా ఎంతోమంది మహేష్ బాబును తమ కుటుంబీకుడిగా చేసుకోవడానికి దోహదపడింది మాత్రం 'మురారి' సినిమా. ఈ సినిమా మహేష్ బాబుకు ఫ్యామిలీ ఆడియన్స్ ని దగ్గర చేయడంతో పాటు నటుడిగా మహేష్ ఓ మెట్టు ఎక్కడానికి నిచ్చెనలా నిలిచింది. 104 డిగ్రీల జ్వరం లోనూ మహేష్ ఈ సినిమా షూటింగ్ లో పాగోన్నాడు. ఈ సినిమా ద్వారా సోనాలి బింద్రే తెలుగు తెరకు పరిచయమయ్యింది. 'ఉసురు తగలడం వల్ల ఒక వ్యక్తి వంశం ఎలా దెబ్బతిందనే కథాంశం'తో ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు కృష్ణవంశీ. ఒక కథ సరిగ్గా ఉన్నప్పుడు ఆ కథే ఈ సినిమాకు సరిపోయే పాత్రలను, టెక్నీషియన్స్ ని వెతుక్కుంటుంది అంటుంటారు. నిజంగా ఈ సినిమాకు అలానే జరిగిందేమో అనిపిస్తుంది. మహేష్, సోనాలి నటన.. మణిశర్మ అందించిన మ్యూజిక్.. కుటుంబ సభ్యులుగా నటించిన ప్రతి ఒక్కరిని చూస్తే నిజంగా వారు ఈ సినిమా కోసమే పుట్టారేమో అనిపిస్తుంది. ముఖ్యంగా 'అలనాటి రామచంద్రుడి' పాట ప్రతీ పెళ్లిలోనూ వినిపిస్తూనే ఉంటుంది. అనుకున్నదానికంటే నెలన్నర ఆలస్యంగా ఫిబ్రవరి 17, 2001న విడుదలైన 'మురారి' భారీ విజయాన్ని నమోదు చెయ్యడమే కాకుండా ఆ ఏడాది ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారంలో ఉత్తమ చిత్రానికి రజత నందితో పాటు మరో 2 అవార్డులను సొంతం చేసుకుంది. మహేష్ కెరీర్ ను మలుపుతిప్పిన మురారి విడుదలై నేటికీ సరిగ్గా '19ఏళ్ళు'.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa