2019లో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు తమిళ సూపర్‌స్టార్ అజిత్. ఇప్పుడు ఆయన ‘వాలిమాయ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్‌లో అజిత్ గాయపడ్డారట. అజిత్‌కి డూప్ చేత స్టంట్స్ చేయించుకోవడం నచ్చదు. ఎంత రిస్కీ స్టంట్ అయినా కూడా ఆయనే చేసేస్తారు. చెన్నైలో షూటింగ్ జరుగుతుండగా బైక్‌పై అజిత్ ఓ రిస్కీ స్టంట్ చేయాల్సి ఉందట. ఆ సమయంలో ఆయన బైక్ పై నుంచి జారిపడిపోయారు.
దాంతో బాగా గాయాలయ్యాయట. అయితే అంతగా గాయపడినప్పటికీ ఇరవై నిమిషాలు మాత్రమే బ్రేక్ తీసుకున్నారట. ఆ తర్వాత మళ్లీ అదే బైక్ స్టంట్ చేస్తానని దర్శకుడితో చెప్పారు. ఇందుకు దర్శకుడు ఒప్పుకోకపోయినా, అజిత్ మాత్రం తాను ఆ స్టంట్ చేసి తీరతానని పట్టుబడుతున్నారు. అజిత్‌కి గాయాలు అయ్యాయి అని తెలీగానే ఫ్యాన్స్ అంతా ఆందోళన చెందుతున్నారు. "get well soon thala" హ్యాష్‌ట్యాగ్‌ను క్రియేట్ చేసి అజిత్ త్వరగా కోలుకోవాలని ట్వీ్ట్స్ పెడుతున్నారు. ఇండియా వైడ్ ఈ హ్యాష్‌ట్యాగ్ రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు 18 వేలకు మంది పైగా ట్వీట్స్ చేసారు. అజిత్‌కి ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందో దీనిని బట్టే అర్థమవుతోంది.
మరో విషయం ఏంటంటే.. అజిత్‌కి ‘వాలిమాయ్’ సినిమాను తెరకెక్కిస్తున్న వినోద్‌కి గొడవలు వచ్చాయని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అందుకే షూటింగ్ వాయిదా పడిందని కూడా అంటున్నారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని వాలిమాయ్ టీం క్లారిటీ ఇచ్చింది. త్వరలో విదేశాల్లో షూటింగ్ జరగబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గతేడాది వీరిద్దరి కాంబినేషన్‌లో ‘నేర్కొండ పార్వాయ్’ సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa