యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుల్లి తెరపై సందడి చేస్తూనే అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తుంటుంది. తాజాగా రష్మీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని తన సొంత ఊరైన బెహ్రాంపూర్ సమీపంలో రష్మీ వంద ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిందని ప్రచారం జరుగుతోంది. ఈ భూమిలో యూకలిప్టస్, కోకా చెట్లను పెంచాలని ఆమె భావిస్తోందట. దీనిపై రష్మీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa