నయనతార తాజాగా తమిళంలో నటించిన సస్సెన్స్ హారర్ థ్రిల్లర్ ఘన విజయం సాధించింది . యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్ ఈ చిత్రాన్ని ‘వసంత కాలం’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. 5 కలర్స్ మల్టీ మీడియా పతాకంపై నిర్మాణమైన ఈ చిత్రంలో భూమిక, ప్రతాప్ పోతన్, రోహిణి హట్టంగడ్ ముఖ్య పాత్రలు పోషించారు. ‘బిల్లా-2’ ఫేమ్ చక్రి తోలేటి దర్సకత్వం వహించారు. రేపు ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకుముందు ‘ఏకవీర, వెంటాడు-వేటాడు” వంటి భారీ చిత్రాలు అందించిన యువ నిర్మాత దామెర వి.ఎస్.ఎస్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. “టాప్ హీరోలకు తీసిపోని సూపర్ క్రేజ్ కలిగిన నయనతార నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం ‘వసంతకాలం’. సస్పెస్న్ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకముంది” అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa