ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేహాకక్కర్ ను పొగడ్తలతో ముంచేస్తున్న అభిమానులు...

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 21, 2020, 03:06 PM

పేద  పిల్లలకు  సాయం చేస్తూ తన ఉదార స్వభావాన్ని చాటుకుంది  బాలీవుడ్ గాయని నేహాకక్కర్. చేయి చాచి అడిగిన పిల్లలకు లేదనకుండా సాయం చేసి అభిమానుల మనసు గెలుచుకుంది. ఓ కార్యక్రమానికి హాజరైన  నేహా  దగ్గరికి  ఇద్దరు వీధిబాలలు చేరుకుని టిష్యూ పేపర్లు  కొనమని కోరారు. దీంతో ఈ గాయని ఏ మాత్రం సంకోచించకుండా వెంటనే రూ.2 వేల నోట్లను తీసి వారి చేతిలో పెట్టింది. ఇలా వీధిబాలలకు సాయం చేస్తుండగా క్లిక్‌మనిపించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆమె దాతృత్వానికి పొంగిపోయిన అభిమానులు నేహాను పొగడ్తలతో ముంచెత్తారు. ‘కింది స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి’, ‘ఆమెది బంగారం లాంటి మనసు. చిన్నపిల్లలు అడగగానే ఏ మాత్రం సంకోచించకుండా, చిరాకు పడకుండా సహాయం చేసిందని కొనియాడారు. ఈ  కార్యక్రమం అనంతరం బయటకు వచ్చిన నేహాను మీ పెళ్లెప్పుడంటూ ఓ విలేఖరి ప్రశ్నించాడు. దీనికి ఆమె ఏమీ బదులివ్వకుండా చిరునవ్వుతో అక్కడ నుంచి నిష్క్రమించింది. సోషల్‌ మీడియాలో మాత్రం తన పెళ్లివార్తలపై స్పందించింది. సింగర్‌ ఆదిత్య నారాయన్‌ను పెళ్లాడనుందన్న వార్తలను ఖండించింది. తాను సింగిల్‌గానే ఎంతో హ్యాపీగా ఉన్నానని. పెళ్లి.. గిల్లీ ఏమీ లేదని స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa