ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న బహుభాషా ఓటీటీ ప్లాట్ ఫారమ్ జీ5, తన తదుపరి తెలుగు ఒరిజినల్ సిరీస్‌గా ‘చదరంగం’ అనే ఒక రాజకీయ డ్రామాను ప్రసారం చేయనుంది. శ్రీకాంత్, సునైన, నాగినీడు, కౌసల్య తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. మంచు విష్ణు తన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మించిన ఈ సిరీస్‌కు రాజ్ దర్శకత్వం వహించగా, జీ5లో ఫిబ్రవరి 20 నుంచి ఇది ప్రదర్శించబడుతుంది. ఈ షో లాంచ్ వేడుకలో మంచు విష్ణు మాట్లాడుతూ… ఎన్టీరామారావు రాజకీయ ప్రస్థానంలో చిన్న ఎపిసోడ్ తీసుకుని ఇప్పటి సిట్యూయేషన్‌కి లింక్ చేస్తూ చేసిన చిత్రం ఇది. ఈ సినిమా చేస్తానన్నప్పుడు నాన్నగారు చాలా చాలా చెప్పారు. చాలా జాగ్రత్తగా తీయవలసిన చిత్రమిది అని. అలాగే వాస్తవాలను ప్రజలకు చూపించు అని చెప్పారు. ఈ కథ నా దగ్గరికి రాగానే ముందు నేను పరుచూరి గోపాలకృష్ణగారిని అడిగాను. ఆయన ఇప్పుడు ఇదంతా ఎందుకమ్మా అని అన్నారు. ప్రజలకు వాస్తవాలు చూపిస్తాను. కొంత ఫిక్షన్ కలిపి తీయాలనుకుంటున్నానని తెలపగానే.. ఆయన కూడా సరే అని హెల్ప్ చేశారు. ఇంకా దీని కోసం జీ5 వారు మరియు ఇందులో నటించిన ఆర్టిస్ట్‌లు అందరూ కూడా ఎంతగానో తమ సహాయ సహకారాలని అందించారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాను. ఫ్యూచర్ మొత్తం డిజిటల్‌దే అని తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa