దర్శకుడు గోపిచంద్ మలినేని డైరెక్షన్‌లో "క్రాక్" అనే సినిమా చేస్తున్నాడు నటుడు రవితేజ. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందుతున్న క్రాక్ సినిమాని మే 8న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. రవితేజ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో వీరి ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన బలుపు మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కూడా రవితేజ సరసన ఆడిపాడనుంది. ఆమె పాత్ర కూడా కీలకంగా ఉంటుందట. ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా చిత్ర టీజర్ సాయంత్రం 6.03ని.లకి విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa