బుచ్చి బాబు దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ తేజ్ హీరోగా ఉప్పెన సినిమాతో వెండి తెరకు పరిచయం అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం దాదాపుగా పూర్తి కావొచ్చిందని సమాచారం. కాగా ఈ వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. కాగా అసలు విషయం ఏంటంటే ఈ చిత్రానికి సంబందించిన ఒక వార్త ప్రస్తుతానికి ఫిలిం నగర్ వర్గాల్లో హల్చల్ సృష్టిస్తుంది. కాగా ఈ చిత్రానికి కేటాయించిన డబ్బు కంటే కూడా ఎక్కువగా ఖర్చు అవుతుందని సమాచారం. దానికి కారణం లేకపోలేదు. ఈ చిత్రంలో కొన్ని ఉత్తమ విజువల్స్ ఉండనున్నాయని, అందుకు నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa