వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రాబోతున్న చిత్రం ‘భీష్మ’. ఈ సినిమా శివరాత్రి కనుకగా రిలీజ్ చేశారు.నితిన్ భీష్మ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధిస్తుంది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో నడిచిన భీష్మ రెండు తెలుగు రాష్ట్రాలలో రికార్డు కలెక్షన్స్ వైపుగా దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భీష్మ మూవీ మంచి వసూళ్లను రాబడుతుంది. ముఖ్యంగా యూఎస్ లో ఈ చిత్ర వసూళ్లు హాఫ్ మిలియన్ కి చేరువ అయ్యాయి. భీష్మ ప్రీమియర్స్ ద్వారా143 లొకేషన్స్ నుండి డీసెంట్ $94,744 డాలర్ల వసూళ్లు అందుకుంది. ఐతే పాజిటివ్ టాక్ రీత్యా శుక్రవారం వసూళ్లు బాగా పెరగడంతో 144 లొకేషన్స్ నుండి $151,697 డాలర్ల వసూళ్లు రాబట్టింది. ఇక శనివారం రాత్రి 10:15 నిమిషాల వరకు 136 లొకేషన్స్ నుండి $234,564 డాలర్ల వసూళ్లు దక్కాయి. మొత్తంగా $481,005 లక్షల గ్రాస్ వసూళ్లకు భీష్మ చేరుకుంది. అనగా శనివారం ముగిసేనాటికి భీష్మ హాఫ్ మిలియన్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.దర్శకుడు వెంకీ కుడుముల యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించగా, మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa