అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24, 25వ తేదీల్లో మన దేశంలో పర్యటించనున్నాడు. ఈ సందర్భంగా కొన్ని ఫన్నీ వీడియోస్ కూడా నెట్టింట్లో హల్‌చల్ చేశాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఓ ఫన్నీ మీమ్‌ను రీ ట్వీట్ చేయడం గమనార్హం. తెలుగు సినిమా ఘనతను ప్రపంచానికి చాటిన `బాహుబలి` సినిమాలోని టైటిల్ సాంగ్ `సాహో రే బాహుబలి` సాంగ్‌లో ప్రబాస్ స్థానంలో ట్రంప్ ముఖాన్ని మార్ఫింగ్ చేసిన మీమ్‌ను ఎవరో పోస్ట్ చేశారు. దాన్ని చూసిన ట్రంప్ రీ ట్వీట్ చేస్తూ.. `ఇండియాలోని నా గొప్ప స్నేహితులను కలుసుకోవడానికి ఎదురుచూస్తున్నాను` అని మెసేజ్ కూడా పోస్ట్ చేశారు. ఈ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Trump as Bahubali | Bahubali Trump https://t.co/5Y5JLvdjjB via @YouTube
— Suryaa Telugu News (@SuryaTeluguNews) February 23, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa