ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొరటాలశివ ప్లాన్ అదేనా..?

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2020, 11:35 AM

చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు కొరటాల శివ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. సందేశంతో కూడిన వినోదభరిత చిత్రంగా ఇది నిర్మితమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం కొరటాల కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.


ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేసే ఆలోచనలో వున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే చెప్పారు. కానీ దసరాకి వాయిదా పడొచ్చనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ ఈ సినిమాను 5 నెలలలోనే పూర్తి చేస్తానని మాట ఇచ్చినట్టుగానే కొరటాల పక్కా ప్లానింగ్ తో వెళుతున్నాడు. మే చివరినాటికి షూటింగును పూర్తి చేసి, ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులను కానిచ్చేసి ఆగస్టులోనే ఈ సినిమాను విడుదల చేయనున్నాడనేది తాజా సమాచారం. ఆగస్టు 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు. అందువలన ఆ రోజును ఎలాంటి పరిస్థితుల్లోను కొరటాల వదులుకోడు. కనుక ఆ రోజునే ఈ సినిమాను విడుదల చేయవచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa