నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా తరువాత ఆయనను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి 'బంగార్రాజు' .. 'నాగేశ్వరరావ్' సిద్ధంగా వున్నాయి. ఆ తరువాత సినిమాను కూడా చైతూ లైన్లో పెట్టేశాడని అంటున్నారు. 'దిల్' రాజు నిర్మించనున్న ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. బీవీఎస్ రవి ఈ సినిమాకి కథను అందించినట్టుగా చెబుతున్నారు. గతంలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ 'మనం' సినిమా చేశాడు. అఖిల్ తో 'హలో' చేసిన విక్రమ్ కుమార్, ఈ సారి చైతూను సెట్ చేయడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa