చిరంజీవి పొరపాటున టంగ్ స్లిప్ అయ్యి 'ఆచార్య' టైటిల్ ను రివీల్ చేసాడని చాలా మంది భావించారు. కానీ చిరు - కొరటాల చర్చల తర్వాతే ఈ ఆచార్య టైటిల్ ని చిరు రివీల్ చెయ్యడం జరిగింది అంటూ ఇన్సైడ్ టాక్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని టైటిల్స్ భారీ వివాదాలకు దారితీశాయి. కొంతమంది చిత్రనిర్మాతలు చివరి నిమిషంలో అనుకున్న టైటిల్ మార్చవలసి వచ్చింది. ఫాన్స్ మెచ్చే.. ఆసక్తికరమైన పేర్లను టైటిల్స్‌గా నమోదు చేసినప్పటికీ, చివరి నిమిషంలో వాటిని మర్చాల్సి పరిస్థితి ఏర్పడింది. అందుకే చిరు - కొరటాల కూడా 'ఆచార్య' చిత్ర టైటిల్‌ను రివీల్ చేయడం ద్వారా అన్ని వివాదాలకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa