యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా తెరకెక్కుతున్న సినిమా '30 రోజుల్లో ప్రేమించటం ఎలా..?' టైటిల్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా.. పాటతోనూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ సినిమాలోని పాట 'నీలి నీలి ఆకాశం..'ను జనవరి 31న విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పటి వరుకు 43 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడమే విశేషం. '30 రోజుల్లో ప్రేమించటం ఎలా..?' సినిమాకు మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. తొలి సినిమా అయినప్పటికీ ఈ సినిమాను మంచి దృశ్యకావ్యంగా మలిచారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ పార్ట్ అంతా పూర్తయింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రదీప్ మాచిరాజు చక్కని నటన ప్రదర్శించారని దర్శక నిర్మాతలు తెలిపారు. మరోవైపు ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa