మూడేళ్ల క్రితమే ఓ హిందీ సినిమాకు ఓకే చెప్పానని కథానాయకుడు ప్రభాస్ ఇటీవల ఓ పత్రికతో పేర్కొన్నారు. ఇది ఓ ప్రేమకథ అని, ‘సాహో’ తర్వాత ఇందులో నటిస్తానని చెప్పారు. కాగా ఈ సినిమాలో కథానాయిక ఎవరన్న విషయంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. కాగా ప్రభాస్ సరసన దీపికా పదుకొణెను అనుకుంటున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ మేరకు నిర్మాతలు ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. దీపికకు కుదరకపోతే అలియాభట్, కత్రినా కైఫ్.. వీరిద్దరిలో ఒకర్ని తీసుకోవాలి భావిస్తోన్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa