ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిట్ మూవీ లేటెస్ట్ కలెక్షన్స్...

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 07, 2020, 01:22 PM

విస్వక్ సేన్, రుహాని శర్మ జంటగా నటించిన తాజా చిత్రం 'హిట్'. ఈ చిత్రం ఫిబ్రవరి 28న విడుదలైంది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం మొదటి 3 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి.. టైటిల్ కు తగినట్టుగానే 'హిట్' అనిపించుకుంది. ఇక వీక్ డేస్ లో కూడా మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది ఈ చిత్రం. సస్పెన్స్ థ్రిల్లర్, ఎంగేజింగ్ థ్రిల్లర్ అంటూ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం పై ప్రశంసలు కురిపిస్తున్నారు. గురువారంతో మొదటి వారం పూర్తిచేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల 70 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. ఈ సినిమా చేసిన ప్రీ-రిలీజ్ బిజినెస్ తో (4 కోట్లు) దాదాపు ఇది సమానం. అలా ఈ సినిమా సేఫ్ వెంచర్ అనిపించుకోవడానికి వారం పట్టింది. నిజానికి విడుదలైన 3 రోజులకే ఈ సినిమా లాభాల బాట పట్టేస్తుందని అంతా ఊదరగొట్టారు. కట్ చేస్తే, నాలుగో రోజు నంచి బి, సి సెంటర్లలో సినిమా చతికిలపడింది. అలా మల్టీప్లెక్సులకే పరిమితమైన ఈ సినిమా ఎట్టకేలకు బ్రేక్-ఈవెన్ అయింది. వచ్చి వారం అయింది కాబట్టి ఇక లాభాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.


నైజాం - రూ. 2.62 కోట్లు


సీడెడ్ - 40 లక్షలు


ఉత్తరాంధ్ర - 49 లక్షలు


ఈస్ట్ - 24 లక్షలు


వెస్ట్ - 21 లక్షలు


గుంటూరు - 32 లక్షలు


నెల్లూరు - 14 లక్షలు


కృష్ణా - 28 లక్షలు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa