ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూవీ రివ్యూ : 'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి'

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 07, 2020, 01:25 PM

ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, కోమలి ప్రసాద్, సిద్ధి ఎడ్నాని ప్రధాన పాత్రలలో తెరకెక్కిన థ్రిల్లర్ అనుకొన్నది ఒక్కటి అయినది ఒక్కటి. బాలు అడుసుమల్లి తెరకెక్కించిన ఈ చిత్రం నిన్న విడుదలైంది... 
కథ: ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, కోమలి ప్రసాద్, సిద్ధి ఎడ్నాని మంచి స్నేహితులు. కార్పొరేట్ కల్చర్ కలిగిన ఈ నలుగురు యువతులు ఓ ఫ్రెండ్ మ్యారేజ్ కోసం గోవా వెళతారు. అక్కడ వీళ్ళు తీసుకున్న ఒక అనాలోచిత నిర్ణయం వలన ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. అసలు వాళ్లు తీసుకున్న ఆ అనాలోచిత నిర్ణయం ఏమిటీ? వారు ఎవరిని మర్డర్ చేశారు? మరి ఈ మర్డర్ కేసు నుండి వాళ్ళు బయటపడ్డారా? ఈ నలుగురు యువతుల కథ చివరికి ఎలా ముగిసింది? అనేది మిగతా కథ…
ప్లస్ పాయింట్స్: ప్రధాన పాత్రలు చేసిన ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, కోమలి ప్రసాద్, సిద్ధి ఎడ్నాని బోల్డ్ కంటెంట్ రోల్స్ లో చాలా చక్కగా నటించారు. సినిమాలో వీరి గ్లామర్ మెప్పిస్తుంది. ధాన్యా బాలకృష్ణ అటు గ్లామర్ పరంగా ఇటు ఎమోషన్స్ కూడా బాగా పండించింది. త్రిదా చౌదరి రోల్ మిగతా ముగ్గురి పాత్రలకు మంచి సపోర్ట్ ఇవ్వగా కోమలి ప్రసాద్ పాత్ర నలుగురిలో ప్రత్యేకంగా నిలిచింది. ఆమె బోల్డ్ రోల్ చేయడంతో పాటు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులకు మంచి నవ్వులు పంచింది. ఇక పోలీస్ పాత్రలో సమీర్ పాత్రకు తగ్గట్టుగా చక్కగా ఒదిగిపోయారు. బిగ్ బాస్ ఫేమ్ హిమజ పాత్ర తెరపై కొన్ని నవ్వులు పంచింది.


మైనస్ పాయింట్స్: నేటి సమాజంలో ఆధునిక యువతుల తీరు, పరిస్థితులను చెప్పేలా ఓ నూతన పాయింట్ ను దర్శకుడు తీసుకున్నప్పటికీ దానిని తెరపై ఆసక్తికరంగా మలచడంలో విఫలం చెందాడు. కామెడీ కోసం అనవసరమైన అనేక సన్నివేశాలు జోడించారు. మర్డర్ కేసులో ఇరుకున్న యువతులు తమ జీవితాలు నాశనమై పోయాయని ఎంతో బాధపడతారు. చివరికి వారి సమస్యల పరిష్కారం కానీ, వారు ఎదుర్కొనే పరిస్థులలో కానీ ఏమంత సంఘర్షణ ఉండదు. దీనితో మూవీ ఆ థ్రిల్ అండ్ టెంపో మిస్ అయ్యింది. ముఖ్యంగా సినిమా సెకండ్ హాఫ్ చాలా డల్ గా సాగుతుంది. విషయం లేని స్క్రీన్ ప్లే వలన ప్రేక్షకులకు తరువాత ఏమిటి అనే ఆసక్తి కలగదు.
సాంకేతిక విభాగం: ఈ మూవీలో సంగీతం ఏమాత్రం ఆకట్టుకోదు. బీజీఎమ్ మరియు కెమెరా వర్క్ పరవాలేదు అన్నట్లుగా ఉన్నాయి.గోవా అందాలను మరింత బాగా చూపించే అవకాశం ఉన్న ఉపయోగించుకోలేదు. బోల్డ్ డైలాగ్స్ మాత్రం సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ని మెప్పించే అవకాశం కలదు. ఇక కొత్త దర్శకుడు బాలు అడుసుమల్లి ఆడపిల్ల స్వేచ్ఛ హద్దులు దాటితే ఎటువంటి పర్యవసానాలు ఎదురుకోవాల్సి వస్తుంది అనే మంచి పాయింట్ ని కథా వస్తువుగా తీసుకున్నారు. నేటి ఆధునిక యుగంలో కొందరు యువతుల జీవన శైలి ఎలా ఉంటుంది… అనే విషయాన్ని ప్రస్తావించిన విధానం బాగుంది. కథకు తగ్గట్టుగా ఆయన రాసుకున్న కొన్ని సన్నివేశాలు, సిట్యువేషనల్ కామెడీ ఆకట్టుకున్నాయి. అలాగే చివరి అరగంట ఆయన సినిమాను ఆసక్తిగా మలిచారు.


తీర్పు: అనుకొన్నది ఒక్కటి అయినది ఒక్కటి అక్కడక్కడా ఆకట్టుకొనే థ్రిల్లర్. పూర్తి స్థాయిలో కామెడీ కానీ, పాత్రల మధ్య ఎమోషన్స్ కానీ పండక పోవడం వలన ఈ మూవీ అంతగా ఆకట్టుకోదు. బోల్డ్ కంటెంట్ మరియు మసాలా డైలాగ్స్, హీరోయిన్స్ గ్లామర్ షో ఈ మూవీలో కొంచెం ఆకట్టుకొనే అంశాలు. కేవలం హీరోయిన్స్ గ్లామర్ కోసం మాత్రమే వెళ్లేవారికి ఈ మూవీ ఒకింత నచ్చే అవకాశం కలదు.
నటీనటులు :  ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, కోమలి ప్రసాద్, సిద్ధి ఎడ్నాని, సమీర్, హిమజ తదితరులు
దర్శకత్వం : బాలు అడుసుమల్లి ,నిర్మాత‌లు : హిమ వెలగపూడి ,సంగీతం :  వికాస్ బడిస ,సినిమాటోగ్రఫర్ : శేఖర్ జి,ఎడిటర్ : మణి కాంత్.
రేటింగ్ : 2.75/5. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa