కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టినా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న శృతి హాసన్ కెరీర్ బాగా డౌన్ ఫాల్ లో ఉంది. లాస్ట్ ఇయర్ రాక రాక పవన్ కళ్యాణ్ పక్కన కాటమ రాయుడు లో ఛాన్స్ వస్తే అది కాస్త డిజాస్టర్ కావడంతో పాటు అందులో శృతి మునపటి గ్లామర్ బాగా తగ్గినట్టు కనిపించడంతో అట్టే అవకాశాలు రాలేదు. మరోపక్క హిందిలో ఏరికోరి చేసిన సినిమాలన్ని ఒకదాన్ని మించి ఒకటి అట్టర్ ఫ్లాప్ కావడం తనను అక్కడ పట్టించుకోవడం మానేసారు. ఈ మధ్య తన బాయ్ ఫ్రెండ్ మైకేల్ తో కలిసి పబ్లిక్ ఫంక్షన్స్ కి వస్తున్న శృతి తమ మధ్య రిలేషన్ గురించి మాత్రం మాట వరసకు కూడా చెప్పడం లేదు. త్వరలో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అని కూడా కోలీవుడ్ మీడియా కథనం.
ఇక ఫ్లాప్ గురించి మాట్లాడుతూ తన కెరీర్ లో అన్ని చూశానని ఏదైనా సినిమా ఫ్లాప్ అయ్యిందంటే దానికి కారణం హీరొయిన్ కాదని - సవాలక్ష ఉంటాయని - అయినా కూడా వాటిని తాను కేర్ చేయనని - దర్శకుడు చెప్పినట్టుగా నటించడమే తన పని అని చెప్పిన శృతి పరాజయం పాలైన సినిమాల గురించి అతి తక్కువ ఆలోచిస్తాను అని చెప్పింది. శృతి హిందిలో ఎంట్రీ ఇచ్చిన తొలి డెబ్యు మూవీ 'లక్' ఫ్లాప్ అయ్యింది. సంజయ్ దత్ లాంటి స్టార్ హీరో ఉన్నా అది ఆడలేదు. తర్వాత చేసినవన్నీ క్యు కట్టి ఫ్లాప్ అయ్యాయి.
పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ చేసాక ఒక్కసారిగా దశ మారిపోయింది శృతి హాసన్ కు. రవితేజ బలుపు - మహేష్ బాబు శ్రీమంతుడు ఇలా స్టార్ హీరోల సరసన చేసిన సినిమాలు వరసబెట్టి హిట్ కావడంతో ఇక్కడే సెటిల్ అవుతుంది అనుకున్నారు. కానీ బాలీవుడ్ మోజులో పడి అక్కడ కొన్ని సినిమాలు చేసింది. ఏది వర్క్ అవుట్ కాలేదు. నాన్న కమల్ తో మొదటి సారి కలిసి నటించిన శభాష్ నాయుడు ఇంకా విడుదల కావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa