శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఒకటిగా 'ఢీ' కనిపిస్తుంది. పూర్తి వినోదభరిత చిత్రంగా రూపొందిన ఈ సినిమా, విష్ణుకి మంచి విజయాన్ని కట్టబెటింది. అవసరమైన సమయంలో ఆయన కెరియర్ కి ఈ సినిమా హెల్ప్ అయింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయడానికి విష్ణు సిద్ధమవుతున్నాడు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. తను ఇంతవరకూ చేసిన సినిమాల్లో 'ఢీ' అంటే చాలా ఇష్టమని ఆయన అన్నాడు. అన్నివర్గాల ప్రేక్షకులను ఆ సినిమా ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాడు. అందువలన ఆ సినిమాకి సీక్వెల్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే శ్రీను వైట్ల వెల్లడిస్తాడని అన్నాడు. చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీను వైట్లకి .. మంచు విష్ణుకి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa