‘జబర్దస్త్’ హాట్ బ్యూటీ అనసూయ గురువారం నాడు ట్విట్టర్లో తన అభిమానులతో కలిసి కాసేపు ముచ్చటించింది. ‘మీ పేరుకి అర్థం ఏంటీ?’ అని ఒక అభిమాని అడగగా ‘అసూయ లేనిది అనసూయ’ అని ఆమె చెప్పింది. ‘మీరు ఇంత త్వరగా పెళ్లి ఎందుకు చేసుకున్నారు?’ అని మరో నెటిజన్ అడగగా ‘అందరికీ ఒకటే చెబుతున్నా. నా జీవితంలో మంచి విషయాలన్నీ జరగాల్సిన సమయానికే జరిగాయి’ అని చెప్పింది. ‘నాకు పరీక్షలు ఉన్నాయి… ఆల్ ది బెస్ట్ చెప్పు మేడం’ అని ఒక అభిమాని కోరగా… అనసూయ సదరు అభిమానికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ‘నీ బలం ఏంటీ?’ అని ఒక నెటిజన్ అడగగా ‘నా ఆత్మ’ అంటూ ఆమె సరదాగా రిప్లై ఇచ్చింది. ‘రంగస్థలం’లో మీరు రామ్ చరణ్ కి అత్తగా చేస్తున్నారా? అని ఒక అభిమాని అడగగా ‘అసత్యం’ అని అనసూయ సమాధానం ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa