స్లీవ్ లెస్ లు.. షార్ట్ లెంగ్త్ లు.. లోనెక్ లు.. స్కిన్ టైట్లు.. ఇలా అల్ట్రా మోడ్రన్ డ్రస్సులో మెరిసి మెప్పించే భామలెందరో ఇండస్ట్రీలో ఉన్నారు. ఎప్పుడూ ఇలాంటి డ్రస్సులతోనే కనిపించే భామ ఉన్నట్టుండి పూర్తి ట్రెడిషనల్ గా కనిపించాల్సి వస్తే అది ఆమెను చూసే వాళ్లకే కాదు.. ఆమెకే కొత్త అనిపిస్తే ఎంతమాత్రమూ తప్పుకాదు. మిస్ ఇండియా పాప అదితి ఆర్యకి ఈ మధ్యనే ఇలాంటి ఎక్స్ పీరియన్స్ ఎదురైంది.
తీర్చిదిద్దిన శిల్పంలా కనిపించే అదితి ఆర్య తెలుగు ప్రేక్షకులకు తెలిసిన అందమే. కాకపోతే అంతగా నోటవలేదు. ఇంతకుముందు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఇజం సినిమాలో కనిపించింది. ఆ సినిమా పెద్దగా హిట్టవకపోవడంతో టాలీవుడ్ ఫోకస్ ఆమెపై పడలేదు. తాజాగా నిజార్ షఫీ డైరెక్షన్ లో వస్తున్న నన్ను వదిలి నీవు పోలేవులే సినిమాలో ఈ భామ మరోసారి కనిపించనుంది. ఇందులో అదితి సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా నటిస్తోంది. ఈ సినిమాలో తన పాత్రలో మోడ్రన్ డ్రస్సులతో పాటు సంప్రదాయ దుస్తుల్లోనూ నటించాల్సి వచ్చింది. ‘‘ఇప్పడు చేస్తున్న సినిమా షూటింగ్ కోసం తొలిసారి హాఫ్ శారీ కట్టుకున్నా.. నా జీవితంలో ఇలాంటి డ్రస్ వేసుకోవడం ఇదే మొట్టమొదటిసారి. నన్ను చూస్తే నాకే కొత్తగా అనిపించింది. ఇటు సంప్రదాయకంగా.. అటు గ్లామర్ గా కనిపించే పాత్రలో నటించడం కొత్త అనుభూతి’’ అని చెప్పుకొచ్చింది అదితి ఆర్య
నార్త్ లో ప్రస్తుతం వెబ్ సిరీస్ బిజీగా ఉన్న అదితి సౌత్ లో మాత్రం యాక్టింగ్ పరంగా రాణించే ఛాలెంజింగ్ రోల్స్ వస్తున్నాయని ఆనందంగా చెబుతోంది. ఓరకంగా హైదరాబాద్ తనకు రెండో ఇల్లు లాంటిదని అంటోంది. ఇంతవరకు గ్లామర్ లో ఓవర్ డోస్ తోనే కనిపించిన అదితి ట్రెడిషనల్ గా ఎంతవరకు మెప్పిస్తుందో చూద్దాం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa