టాలీవుడ్ లో ప్రస్తుతం చాలా మంది హీరోయిన్స్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు షాక్ ఇస్తున్నాయి. స్టార్ హీరోలతో ఛాన్స్ దొరికిందంటే పది నిమిషాల క్యారెక్టర్ అయినా పర్లేదు అనేలా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మరికొంత మంది అయితే కేవలం గ్లామర్ రోల్స్ కి మాత్రమే చేస్తున్నారు. ఒకప్పుడు సమంత దూకుడు సినిమాలో కేవలం పాటలకు కొన్ని సీన్లకు మాత్రమే ఉపయోగపడింది. ఇక రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ కూడా స్పైడర్ లో అలాంటి క్యారెక్టర్ మాత్రమే చేసింది.
ఇక అదే తరహాలో ఇప్పుడు అను ఇమ్మన్యుయెల్ కూడా చేస్తోందా అని అనిపిస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఆజ్ఞతవాసి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమాపై మొదట భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ సినిమా రిలీజ్ అయిన తరువాత మ్యాటర్ మొదటి షోకే అర్థమైంది. అను బేబీ క్యారెక్టర్ కి అంతగా గుర్తింపు కూడా ఏమి రాలేదు. కేవలం గ్లామర్ షో వరకే పనికొచ్చింది. దీంతో అమ్మడి ఆశలు అన్ని అవిరైపోయాయి. అయితే ఈ హీరోయిన్ నెక్స్ట్ కూడా అలాంటి క్యారెక్టర్ అని తెలుస్తోంది
ప్రస్తుతం అల్లు అర్జున్ తో నా పేరు సూర్య అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ కోసం అను కేవలం 15 రోజులు మాత్రమే వర్క్ చేసిందట. దీంతో బేబీ క్యారెక్టర్ లో మ్యాటర్ లేనట్లే అని టాక్ వినిపిస్తోంది. అసలే సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఫస్ట్ ఇంపాక్ట్ ఇంకా హల్ చల్ చేస్తూనే ఉంది. మరి ఈ సినిమా అనుకి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa