ఏంజెలినా జోలి.. పరిచయం చేయాల్సిన అవసరం లేని హాలీవుడ్ నటి. ఏళ్లు గడుస్తున్నా ఏ మాత్రం సడలని అందం.. అంతే ఎనర్జీతో రీల్ లైఫ్ ను లీడ్ చేస్తున్న ఆమె.. టాప్ పొజిషన్లో కొనసాగుతోంది. అందానికి నిలువెత్తు రూపంగా కొలిచే అభిమానులు కోట్లల్లో ఉన్నారు. దేశాలకు అతీతంగా ఆమెను అభిమానించటమే కాదు..ఆరాధిస్తుంటారు.
తెర మీద ఆమె పోషించే పాత్రల మాట ఎలా ఉన్నా.. రియల్ లైఫ్ లో ఆమె ప్రదర్శించే తీరుకు ఫిదా అవుతుంటారు. వివిధ దేశాలకు చెందిన అనాధ పిల్లల్ని సొంత బిడ్డల కంటే ఎక్కువగా సాకే జోలీ తీరు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందనటంలో సందేహం లేదు. రీల్ లైఫ్ లో విజయవంతంగా దూసుకుపోతున్న ఆమెకు.. రియల్ లైఫ్ లో మాత్రం చాలానే సమస్యల్ని ఎదుర్కొంటుందని చెప్పక తప్పదు.
ఆరుగురు పిల్లల ఆలనాపాలనా చూసుకుంటున్న ఆమె.. భర్త బ్రాడ్ పిట్ తో ఆ మధ్యన విడిపోవటం తెలిసిందే. భర్త తోడు లేకున్నా.. ఆరుగురి పిల్లల పెంపకం విషయంలో ప్రత్యేక కేర్ తీసుకునే ఈ 42 ఏళ్ల సుందరాంగి.. వ్యక్తిగత జీవిత ఒత్తిడి వృత్తి జీవితం మీద ఏ మాత్రం పడకుండా జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది.
సమస్యల మధ్య నడుస్తూ.. వాటి ప్రభావం ఏమీ పడకుండా ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న ప్రశ్నను సంధిస్తే.. సింపుల్ గా నవ్వి ఊరుకోవటమే కాదు.. రియాక్ట్ కావటం కనిపించదు. ఎంజెలీనా జోలీతో విడిపోయిన తర్వాత పలువురిలో ప్రేమకలాపాలతో బిజీబిజీగా ఉన్నాడు. మధ్యలో జోలీతో తిరిగి కలిసేందుకు ప్రయత్నించినా.. అందుకు ఆమె ససేమిరా అన్నారు. ఇదిలా ఉంటే.. సింగిల్ గా ఉన్నారు.. మళ్లీ ప్రేమలో పడరా? అంటే.. చచ్చినా ఆ పని మాత్రం చేయనని తేల్చి చెబుతోంది.
తనకు తన పిల్లలు ముఖ్యమని.. వారిని పెంచాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పే జోలీ.. తన జీవితంలో మళ్లీ ప్రేమలో పడే ఛాన్స్ లేదని చెబుతోంది. మరి.. మాజీ భర్తగారు అదే పనిగా ప్రేమలో పడిపోవటంపై పరోక్షంగా ప్రస్తావిస్తూ.. అవేమీ నిజమైన ప్రేమలు కావని.. తాను దాని జోలికి మళ్లీ వెళ్లనంటోంది. ఏమైనా.. ఏంజెలీనా జోలీ తీరే వేరు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa