ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యూనిట్ కి గోల్డ్ కాయిన్స్ బహుమతిగా ఇచ్చిన కీర్తి

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 23, 2018, 11:51 AM

తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి కీర్తి సురేష్‌. కెరీర్ మొదట్లో చిన్న హీరోల సరసన నటించిన కీర్తి ఇప్పుడు స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్స్ అందుకుంటుంది. మొన్న తెలుగులో పవన్ సరసన అజ్ఞాతవాసి చేసిన ఈ అమ్మడు, ఇప్పుడు విజయ్ 62వ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ఇక అలనాటి నటి సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న మహానటి మూవీలో సావిత్రి పాత్ర పోషిస్తుంది కీర్తి సురేష్. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరపుకుంటుండగా, మార్చి 29న ప్రేక్షకుల ముందుకి తేవాలని ప్లాన్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సి. అశ్వినీదత్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్నా దత్ నిర్మిస్తున్నారు.


మహానటి మూవీలో సావిత్రి పాత్ర పోషిస్తున్న కీర్తి సురేష్ ఆమె గురించి చాలా తెలుసుకున్నారట. ఆమె పాత్ర పోషిస్తున్నందుకు చాలా సంతృప్తి చెందిన కీర్తి తన యూనిట్ కి బంగారు నాణేలు బహుకరించిందట. సావిత్రి కూడా తన యూనిట్ కి ఇలానే ఇవ్వడంతో ఈమెని కీర్తి అనుసరించిందని చెబుతున్నారు. దాదాపు 100 మందికి కీర్తి సురేష్ గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇచ్చారని సమాచారం. 5 గ్రాముల నుంచి 10 గ్రాముల వరకూ ఆ కాయిన్ ఉంటుందట. 100 కాయిన్స్ అంటే 25 లక్షల వరకూ కీర్తి ఖర్చు పెట్టి ఉంటారని సమాచారం. మహానటి చిత్రంలో మోహన్‌బాబు, సమంత, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, ప్రకాశ్‌రాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, తమిళంలో ఈ మూవీ ‘నడిగర్ తిలగమ్’ అనే టైటిల్ తో విడుదల కానుంది .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa