దర్శకుడు శివ నిర్వాణతో మరో సినిమాను చేయడానికి నటుడు నాని అంగీకరించాడు. ఈ సినిమాకి ‘టక్ జగదీశ్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో నాని ఫ్రెంచ్ కట్ తో .. డిఫరెంట్ లుక్ తో చాలా స్టైలీష్ గా కనిపిస్తాడట. ఇంతవరకూ ఆయన చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని సమాచారం. తదుపరి షెడ్యూల్ కోసం ఏప్రిల్ 2వ వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. రీతూ వర్మ .. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa