బాహుబలి తర్వాత జక్కన్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. ఎన్టీఆర్ .. చరణ్ ప్రధాన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత జన్నక్క ఏ హీరోతో సినిమా తెరకెక్కిస్తారు అనే అంశంపై ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.తాజా సమాచారం ప్రకారం ఆర్.ఆర్.ఆర్ తర్వాత రాజమౌళి రానా తోకానీ, ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్ తో కానీ సినిమా చేస్తాడనే టాక్ వినపడుతుంది. ఈ సినిమాకి ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేయడం జరిగిపోయిందని అంటున్నారు. కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa