తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ సీజన్ 3లో నల్గొండ ఈగల్స్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఈ సందర్భంగా విజేతలతో నిలబడి ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఫోటోలకు ఫోజులిచ్చారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి మైదానంలో జరిగిన ఈ టోర్నీలో నల్లగొండ ఈగల్స్ జట్టు మంచిర్యాల టైగర్స్‌పై గెలుపొంది టైటిల్‌ను సొంతం చేసుకుంది. కాగా మూడు పాయింట్లు సాధించిన కార్తీక్ యాదవ్ (మంచిర్యాల టైగర్స్) ‘బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద మ్యాచ్’ గా ఎంపికయ్యాడు. అయితే ఈ పోటీలో విజేతగా నిలిచిన నల్గొండ ఈగల్స్ జట్టు అంతా ఆర్ఆర్ఆర్ సెట్‌కి వెళ్ళి రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్‌ని కలిసారు. అంతేకాకుండా వారితో కొన్ని ఫోటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ టీమ్ కరోనా కారణంగా షూటింగ్‌ను వాయిదా వేసింది. ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ వచ్చే నెలలో మొదలుకానుంది. తదుపరి షెడ్యూల్ పూణేలో జరగనుంది. ఆర్ ఆర్ ఆర్‌ను DVV దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 8, 2021న దాదాపు పది భాషలలో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa