ఇప్పుడు దర్శకులు రీమేక్ సినిమాల వైపు మొగ్గుచూపుతున్నారు. సినిమా బావుంది అని టాక్ రావడమే తరువాయి అది ఏ భాష చిత్రమయినా ఆ చిత్రం యొక్క రీమేక్ హక్కులను సొంతం చేసుకుంటున్నారు. తాజాగా మలయాళంలో విడుదలై సూపర్ హిట్ సాధించిన సినిమా 'అయ్యప్పనుమ్ కోషియం'. పృథ్వీ రాజ్, బిజు మీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా రీమేక్ హక్కులను నిర్మాత సూర్యదేవర నాగ వంశీ భారీ రేటుకి సొంతం చేసుకున్నట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa