మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టాడట నటుడు అల్లు అర్జున్. లగ్జరీ కార్లను అద్దెకిస్తున్న ఓ కంపెనీలో అల్లు అర్జున్ ఏడు శాతం వాటాలను కొనుగోలు చేశాడని సమాచారం. ఇదే సంస్థలో ఇప్పటికే ఓ ప్రముఖ రాజకీయ నేత కూడా భాగస్వామిగా ఉండగా, ఆయన సలహాతోనే బన్నీ, ఈ వ్యాపారంలోకి వచ్చాడట. ప్రముఖుల ఇళ్లలో శుభకార్యాలు జరిగే వేళ, వచ్చే సెలబ్రిటీల ప్రయాణానికి ఈ సంస్థ ఖరీదైన కార్లను సరఫరా చేస్తూ ఉంటుంది. ఇప్పటివరకూ సినిమా థియేటర్లు, పబ్ ల వ్యాపారంలో ఉన్న బన్నీ, తనకు పెద్దగా పరిచయం లేని కార్ల అద్దె బిజినెస్ లోకి దిగడంపై టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa