'ఆచార్య' సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా చందమామ కాజల్ ఎంపికైంది. ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది. కాగా 'ఆచార్య' సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం మహేష్ ని సంప్రదించారు చిత్ర యూనిట్. కానీ మహేష్ భారీ పారితోషికం ఆశించడంతో వెనుకంజ వేసిన కొరటాల, ఆ పవర్ ఫుల్ పాత్ర కోసం చరణ్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే చరణ్ సరసన మొదట సమంత ని కథానాయికగా ఎంపిక చేద్దామని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఆఫర్ ఇప్పుడు ఫామ్ లో ఉన్న రష్మిక కు వచ్చింది. ప్రస్తుతం రష్మిక బన్నీ- సుకుమార్ సినిమాలో కూడా నటిస్తుంది. దీంతో ఇద్దరు స్టార్ హీరోలతో ఒకటే సమయంలో నటించే ఛాన్స్ కొట్టేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa