చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్లో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. వినోదానికి సందేశం జోడించబడిన కథ ఇది. ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా, ఒక ముఖ్యమైన పాత్రలో చరణ్ నటిస్తున్నాడు. దాంతో చరణ్ పాత్ర ఏమిటి? ఈ సినిమాలో ఆయన ఎలా కనిపించనున్నాడు? అనేది ఆసక్తికరంగా మారింది.జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్ పాత్రలో చరణ్ కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గా చరణ్ పోర్షన్ వస్తుందని అంటున్నారు. ఆయన పాత్ర .. కథను మలుపు తిప్పుతుందని చెబుతున్నారు. ఆ పాత్ర ఆశయం .. భావజాలం నుంచి 'ఆచార్య' స్ఫూర్తిని పొంది తన పోరాటాన్ని కొనసాగిస్తాడని అంటున్నారు. తెరపై చరణ్ పాత్ర 30 నిమిషాల నిడివి కలిగి ఉంటుందనీ, ఆయన కెరియర్లో ఇది చెప్పుకోదగిన పాత్ర అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa