ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరు సినిమాలో అనసూయ సాంగ్?

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 28, 2020, 11:40 AM

కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందుతోంది. చిరంజీవి కథానాయకుడిగా రూపొందుతోన్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. చిరంజీవిని డిఫరెంట్ లుక్ తో .. పవర్ఫుల్ పాత్రలో కొరటాల చూపించనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ను ఎంపిక చేసుకున్నారు.ఇక చిరంజీవి - రెజీనా కాంబినేషన్లో ఒక ఐటమ్ సాంగు కూడా వుంది. ఇటీవలే ఈ పాటను 6 రోజుల పాటు చిత్రీకరించారు. సినిమాలో ఈ పాట ఇంటర్వెల్ కి ముందు రానున్నట్టు తెలుస్తోంది. ఇంటర్వెల్ తరువాత కూడా ఒక ప్రత్యేక సాంగ్ ను ప్లాన్ చేశారట. ఈ స్పెషల్ సాంగు కోసం అనసూయను తీసుకున్నట్టుగా సమాచారం. అనసూయ హాట్ హాట్ గా కనిపిస్తూ చిరంజీవితో కలిసి స్టెప్పులు వేయనుందని అంటున్నారు. ఈ ప్రత్యేక గీతం కోసం ఆమెకి భారీ పారితోషికమే ముట్టినట్టుగా చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa