బుల్లితెరపై పెద్ద యాంకర్ గా పేరుతెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు నటించిన చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెలలో విడుదల కావాల్సి వుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా ప్రదీప్ మాచిరాజు పాల్గొన్నారు. అయితే, ప్రస్తుతం దేశం మొత్తం లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం వాయిదాపడింది. దీంతో ఇప్పటికే ఎంతగానో ప్రచార కార్యక్రమాలను నిర్వహించుకున్న హీరో ప్రదీప్ అప్సెట్ అయ్యాడనే న్యూస్ ఒకటి వినపడుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa