ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలాంటి సినిమాల్లో నటించాలని ఉంది: రానా

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 27, 2018, 10:30 AM

విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు దగ్గుబాటి రానా. ఆయన తొలి సినిమా ‘లీడర్‌’నుంచి ‘నేనే రాజు నేనే మంత్రి’ వరకు అన్ని చిత్రాలు వాటికవే ప్రత్యేకం. అయితే తన సినిమా కథల గురించి రానా తాజాగా ట్వీట్‌ చేశారు. గ్రేట్‌ ఇండియన్‌ స్టోరీస్‌లో నటించాలని ఉందన్నారు.


‘‘లీడర్‌’, ‘ఘాజీ’, ‘నేనే రాజు నేనే మంత్రి’ దేశభక్తి, గొప్ప సంస్కరణల గురించి చెప్పే కథలు. ఈ కథలు నా హృదయానికి చాలా చేరువయ్యాయి. ఇలాంటి మరిన్ని సినిమాల్లో నటించాలని ఉంది. దేశభక్తిని చాటే గొప్ప కథలు ఉంటే, వాటిని మీరు వెండితెరపై చూడాలి అనుకుంటే చెప్పండి’ అని రానా ట్వీట్‌ చేశారు. తన రోజు గురించి మాట్లాడుతూ.. ఆరు గంటల్లో రెండు విమానాలు ఎక్కి, దిగి.. రెండు నగరాలను చేరుకున్నట్లు చెప్పారు.


 


రానా ప్రస్తుతం ‘1945’ సినిమాలో నటిస్తున్నారు. సత్యశివ దర్శకుడు. కె ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎస్‌.ఎన్‌. రాజరాజన్‌ నిర్మిస్తున్నారు. రెజీనా, సత్యరాజ్‌, నాజర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీరియడ్‌ డ్రామాగా దీన్ని రూపొందిస్తున్నారు. మరోపక్క ఆయన ప్రధాన పాత్రలో ‘వెల్‌కం టు న్యూయార్క్‌’ అనే హిందీ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. కామెడీ కథాంశంతో దర్శకుడు చక్రి తోలేటి దీన్ని తీస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa