ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ చరణ్ గురువుగా అజయ్ దేవగన్ ?

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 31, 2020, 07:48 PM

'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేయారు దర్శక ధీరుడు రాజమౌళి. బాహుబలి తర్వాత జక్కన్న ఏ సినిమా తీస్తాడో అని యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదుచూస్తున్న తరుణంలో ఎన్టీఆర్, చరణ్ లతో 'ఆర్.ఆర్.ఆర్' సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లూరి సీతారామరాజు పాత్రను పరిచయం చేసే వీడియోను విడుదల చేశారు.
సోషల్ మీడియాలో ఈ వీడియో ట్రెండ్ అవుతుంది. అయితే ఆర్.ఆర్.ఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో అజయ్ దేవగన్ అల్లూరి సీతారామరాజుకి గురువుగా కనపడనున్నాడట. అల్లూరిలో దేశభక్తిని నింపడంతో అజయ్ దేవగన్ పాత్ర ఎంతగానో దోహదపడుతుందట. ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa