అల్లు శిరీష్ సినిమా వచ్చి సంవత్సరం దాటింది. అయినా ఇప్పటి వరకు కొత్త సినిమా ప్రకటనే రాలేదు. ఈయన తదుపరి చిత్రం విషయంలో చాలా వార్తలు మీడియాలో వచ్చాయి. ఆ దర్శకుడితో ఈ దర్శకుడితో ఆ కథతో ఈ కథతో అంటూ చాలా చాలా కథనాలు అయితే వచ్చాయి. కాని ఇప్పటి వరకు అధికారిక క్లారిటీ మాత్రం రాలేదు. తాజాగా ఒక ఫాలోవర్ ట్విట్టర్ లో తదుపరి చిత్రం గురించి చెప్పాలంటూ పదే పదే రిక్వెస్ట్ చేయడంతో శిరీష్ స్పందించాడు. అతి త్వరలోనే ఒక ఎంటర్ టైన్ మెంట్ చిత్రంతో మీ ముందుకు రాబోతున్నానని ఆయన ప్రకటించాడు. అది ఎప్పుడు ఎవరితో అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది. అందుకే శిరీష్ ఆ దారిలో నడువబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే రాకేశ్ శశి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు శిరీష్ ఓకే చెప్పాడట. ఆ సినిమా ప్రకటన రావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa