ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కెజిఎఫ్ -2' లో హీరో చనిపోతాడా?

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 04, 2020, 12:23 PM

2018లో విడుదలయిన కెజిఎఫ్ భారీ విజయం అందుకుంది. విడుదలైన అన్ని భాషలలో ఈ మూవీ హిట్ కావడం విశేషం. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా కెజిఎఫ్ చాప్టర్ 2 రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ మూవీ 2020 అక్టోబర్ 23న భారీగా విడుదల కానుంది. ఐతే కెజిఎఫ్ చాప్టర్ 2 క్లైమాక్స్ విషయంలో ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఈ మూవీలో సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తుండగా.. బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ దేశ ప్రధాని రోల్ చేస్తున్నారు. కాగా కెజిఎఫ్ 2 లో రాఖి భాయ్ నిర్మించుకున్న సామ్రాజ్యం కూల్చేయడమే కాకుండా అతని మరణానికి కూడా ఆమె కారణం అవుతుందట. అమ్మ మాట ప్రకారం రాఖి రాజు హోదాలో ఆనందంగా చనిపోతాడని టాక్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa