క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి చూపులు’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన‘అర్జున్ రెడ్డి’ సినిమాతో స్టార్ హీరో అయ్యాడు. ‘గీతా గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలతో మరింతగా ఆకట్టుకున్నాడు. కాగా ఆయన లాస్ట్ రెండు సినిమాలు 'డియర్ కామ్రెడ్', వరల్డ్ పేమస్ లవర్ అభిమానులను కొంత నిరాశ పరిచాయి. కాగ ఆయన ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో విజయ్ హిందీ చిత్ర సీమకు పరిచయం కాబోతున్నాడు. ఈ ఫైటర్‌ను తెలుగు, హిందీతో పాటు అన్ని సౌత్ భాషలలో ఒకేసారి తెరకెక్కించనున్నారు. ఫైటర్ కథ.. పాన్ ఇండియాకు అప్పీల్ అవుతుందని భావించిన కరణ్ జోహార్, పూరి, ఛార్మిలతో కలిసి ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాడు. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడింది. లాక్ డౌన్ పూర్తికాగానే తదుపరి షెడ్యూల్ షూటింగ్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఫైటర్ సినిమా తరువాత విజయ్ దేవరకొండ ఏ దర్శకుడితో చేయనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.వస్తోన్న సమాచారం మేరకు విజయ్ దేవరకొండకి చాలామంది యువ దర్శకులు కథలను వినిపించారట. అయితే వాటిలో కాస్త భిన్నంగా అనిపించిన కథకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వివేక్ ఆత్రేయ చెప్పిన కథకు విజయ్ ఓకే చెప్పాడట. వివేక్ 'బ్రోచేవారెవరురా' సినిమాతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబందించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయట. ఈ సినిమాలో కూడా విజయ్ దేవరకొండ పాత్ర చాలా కొత్తగా ఉండనుందట. ఈ సినిమాకు సంబందించి పూర్తి టెక్నికల్ విషయాలు త్వరలో వెల్లడికానున్నాయి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa