లాక్ డౌన్ కారణంగా అంతా ఇంట్లోనే ఉంటున్నారు. కానీ కొందరు మాత్రం అప్పుడప్పుడూ రోడ్డెక్కి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రముఖ కన్నడ హీరోయిన్ షర్మిల మండ్రే విషయంలో కూడా ఇదే జరిగింది. లాక్‌డౌన్ నిబంధనలని ఉల్లంఘించి మరీ స్నేహితులతో కలిసి కారులో జాలీ రైడ్‌కి వెళ్లింది ఈమె. బెంగళూరులోని వసంతనగర్ ఫ్లై ఓవర్ కింద భాగంలోని పిల్లర్‌ను ఆమె కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు కూడా నుజ్జు నుజ్జు అయిందని తెలుస్తుంది. ఈ కారు ప్రమాదంలో నటి షర్మిల మండ్రే ముఖంకు గాయాలైనట్టు ప్రచారం జరుగుతుంది.
అంతేకాదు.. శరీరంలోని కొన్నిచోట్ల కూడా తీవ్రంగానే గాయాలు అయినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై పూర్తి వివరాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఈ కారును షర్మిల మండ్రే స్నేహితుడు లోకేష్ నడిపుతున్నాడని.. అతడే ఆమె బాయ్ ఫ్రెండ్ అని కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈమె యాక్సిడెంట్ కన్నడలో సంచలనం రేపుతుంది. లాక్ డౌన్ పట్టించుకోకుండా బయటికి వెళ్లడమే నేరం అనుకుంటే.. ఇప్పుడు ఇలా యాక్సిడెంట్ కూడా చేయడంతో మరింత సంచలనంగా మారుతుంది విషయం.
ఈ ప్రమాదంలో ఆమెతో పాటు మరో స్నేహితుడికి కూడా గాయాలు అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వీళ్ళంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసుల నుంచి కథనాలు వస్తున్నాయి. అయితే కారు ప్రమాదం జరిగాక హీరోయిన్ షర్మిల ఆమె స్నేహితులు తప్పించుకోవడానికి ప్రయత్నించారని ప్రచారం జరుగుతుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ కారులో మొత్తం నలుగురున్నారని.. వారికి తీవ్రగాయలైనట్టు సాక్షులు చెబుతున్నారు.
ఈ ప్రమాదం జరిగినపుడు అంతా మద్యం సేవించి ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. మందు మత్తులోనే కార్ నడిపి యాక్సిడెంట్ చేసారని తెలుస్తుంది. కాగా షర్మిల మండ్రే తెలుగులో కూడా నటించింది. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన కెవ్వు కేక సినిమాలో ఈమె హీరోయిన్. ఆ తర్వాత కన్నడలో వరస సినిమాలు చేసి అక్కడే సెటిల్ అయిపోయింది. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు ఫైల్ చేసి ధర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa