టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ టాలీవుడ్ తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో గల్లా అశోక్ ఓ యూత్ ఫుల్ చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్. ఇక, ఆదివారం అశోక్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమాలో తన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టేబుల్ ల్యాంప్ వెలుతురులో పుస్తకం చదువుకుంటున్న అశోక్ ను ఈ ఫస్ట్ లుక్ లో చూడొచ్చు.ఈ సినిమాకు సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణకుమారి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై పద్మావతి గల్లా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు సగం పూర్తయింది. కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిలిపివేశారు. ఇందులో జగపతిబాటు, నరేశ్ తదితరులు నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa