ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ ద్విపాత్రాభినయం

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 07, 2020, 12:28 PM

రవితేజ తాజా చిత్రంగా 'క్రాక్' సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఆ తరువాత ఆయన రెండు ప్రాజెక్టులను సెట్  చేసుకున్నాడు. ఒక సినిమాకి రమేశ్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. దాంతో ఆ పాత్రలు ఎలా వుండనున్నాయనేది ఆసక్తికరంగా మారింది.చార్టర్డ్ అకౌంటెంట్ గా .. ఎన్ ఆర్ ఐ బిజినెస్ మేన్ గా రవితేజ కనిపించనున్నట్టు తెలుస్తోంది. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాలో కథానాయికలుగా నిధి అగర్వాల్ .. మాళవిక శర్మ అలరించనున్నారు. గతంలో తమిళంలో విజయాన్ని సాధించిన 'శతురంగ వేట్టై 2' సినిమాకి ఇది రీమేక్ అనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే తెలుగులోను ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa