కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో విధించిన లాక్‌డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకొనేందుకు ప్రముఖ నటుడు చిరంజీవి నేతృత్వలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఎంతోమంది సినీ తారలు మానవతా దృక్పథంతో స్పందించి ఈ ఛారిటీకి తమ వంతు సాయంగా భారీ విరాళాలు అందజేశారు. దీనిద్వారా సమకూరిన నిధులతో సినీ కార్మికుల కోసం నిత్యావసరాలను పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘సినీ కార్మికుల ఇళ్లకు నేరుగా ఈ వస్తువులను పంపిణీ చేసే ఈ ప్రక్రియ మొదలైంది’ అంటూ చిరంజీవి ఓ వీడియోను తన ట్విటర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa