రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమాలో, బాలీవుడ్ .. హాలీవుడ్ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా 75 శాతం చిత్రీకరణను జరుపుకుంది. అయితే లాక్ డౌన్ కారణంగా మిగతా షూటింగు వాయిదా పడింది. ఈ ప్రభావం విడుదల తేదీపై పడిందనే టాక్ వినిపిస్తోంది.వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ అనుకోకుండా 2 నెల గ్యాప్ వచ్చేసింది. అందువలన వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. లాక్ డౌన్ తరువాత కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించాలని భావిస్తున్నారట. ఎందుకంటే ఈ సినిమా విడుదల తేదీని బట్టి, మిగతా సినిమాల విడుదల తేదీలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa