ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక పెద్ద మార్పు చేయబోతున్నారట !

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 14, 2020, 10:18 AM

విజువల్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తోన్న చిత్రంలో కరోనా కారణంగా ఒక పెద్ద మార్పు చేయబోతున్నారు. మొదట ఈ సినిమా క్లైమాక్స్ ను మొరాకోలో భారీ సెట్లలో భారీ స్థాయిలో చిత్రీకరించాలని క్రిష్ ప్లాన్ చేశాడు. కానీ కరోనా దెబ్బకు ఇప్పుడు ఆ ప్లాన్ అంతా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే సెట్స్ వేసి క్లైమాక్స్ ను షూట్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా క్లైమాక్స్ సెట్స్ కి సబంధించి గ్రౌండ్ వర్క్ ను ప్రారంభించారట. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించబోతుంది. ఈ చిత్రంలో ఆమె యువరాణిగా.. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ చిత్రంలో జాక్వెలిన్ పేరున్న ఓ రాజుకి సోదరి పాత్రలో నటించబోతుందట. అలాగే పవన్ ఈ సినిమాలో రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి. అన్నట్టు ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే పేరును అనుకుంటున్నారట. అయితే చిత్ర బృందం నుండి మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ వెలువడలేదు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa