టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని విభిన్నమైన చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పుట్టినరోజుల సందర్భంగా తరవాత చిత్రాన్ని ప్రకటించారు. ఆ నాని 27వ సినిమా టైటిల్‌ను సోమవారం విడుదల చేశారు. 'శ్యామ్ సింగ రాయ్' అనే వైవిధ్యమైన టైటిల్‌ను నాని సినిమాకు పెట్టారు. విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా' చిత్ర దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ సనిమాకు డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ సినిమాకి 'శ్యామ్ సింగ రాయ్' టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుధ్ ను తీసుకోవాలని నాని పట్టుపడుతున్నాడట. గతంలో నాని 'జెర్సీ' .. 'గ్యాంగ్ లీడర్' సినిమాలకి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. ఆ రెండు సినిమాలు విజయాలను అందుకున్నాయి. 'శ్యామ్ సింగ రాయ్' కథ భిన్నమైనది కావడంతో, అనిరుధ్ అయితేనే బాగుంటుందనే ఉద్దేశంతో నాని అతన్ని సిఫార్స్ చేస్తున్నాడట. అనిరుధ్ పారితోషికం ఎక్కువే అయినా, ఆయననే దర్శక నిర్మాతలు సంప్రదిస్తున్నట్టు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa